Friday, June 17, 2016

Home Remedies To Control Hair Fall Loss

జుట్టు ఊడకుండా ఉండెందుకు గృహ చిట్కాలు


తల వెంట్రుకలు రాలతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారూ ఎంతో బధకు గురవ్తున్నరు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధరణం అయిపోయింది. ఈ సమస్య తో బాధపదేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టు పార్లర్ల చుట్టు తిరుగుతున్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అంతేకం. అయితే ఈ సమస్యకు వారి వంశపారంపర్యత కూడా కావచ్చు. అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్లో రక్తప్రసరణ జరగకపొవటం, పౌష్టికాహారలోపం, జన్యు పరమైన సమస్యలు కూడా కావచ్చు. ఈ సమస్య నుంచీ బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలు ఉన్నయి.


మందార పువ్వు

మందార పువ్వు ప్రతీ ఇంట్లో ఉండేదే అయితే మందార ఆకు మందారపువ్వు చాలా బాగ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. అంతేకాక పునర్వృధ్ధికి దోహదం చేస్తుంది. మందార పువ్వు జుట్టు చిట్లతాన్ని కూడా దూరం చేస్తుంది. మందార పువ్వుల్ని 12-13 తీసుకుని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసుకోవాలి. తర్వాత వడగట్టి దానిలో నుంచీ నూనె సారాన్ని తీయాలి. తర్వాత స్కాల్ప్కి అలాగే వెంట్రుకలకి పట్టించాలి. ఒక గంట ఉంచుకుని కడిగేయాలి.

బీట్రూట్

బీట్రూట్ జ్యూస్ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు,కాల్షియం , పొటాషియం, కార్బో హైడ్రేడ్లు , విటమిన్-బీ ఉంటాయి. అందువల్ల బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పని చేస్తుంది. రోజూ మీ ఆహారంతో పాటు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మీ జుట్టే కాడు సరీరం పై కూడా ఎన్నో విధాలుగా పని చేస్తుంది.

కొబ్బరి పాలు

కొబారి పాలులో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. కొబ్బరి తీసుకుని దానిని గ్రైండ్ చేసుకుంటే దానిలో నుంచీ పాలు వస్తాయి. ఆ పాలను తిన్నగా స్కాల్ప్ కి పట్టిస్తే చాలా బాగా పని చేస్తుంది.

టీ డికాషన్

టీ డికాషన్ జుట్టు రాలటాన్ని ఆపుతుంది. 3 టేబుల్ స్పూన్ల తేయాకుల్ని తీసుకుని నీటిలో బాగా మరగించాలి. ఆ తర్వాత ఆ డికాషన్ ని తలకు పట్టించాలి. అంతేకాక దీనిలో నిమ్మ రసాన్ని కూడా కలపాలి. కాసేపు ఉంచిన తర్వాత షాంపూ వాడకుండా కడుగుకోవాలి.

గుడ్డు

గుడ్డు లో ని తెల్ల సొన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేస్తుంది.తెల్ల సొనను తీసుకుని పేస్ట్లా చేసి తర్వాత తలకు రాసుకోవాలి. ఇలా అరగంటా లేదా గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనెగర్

ఆపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వెనెగర్. ఈ వినేగర్ వలన ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈ యాపిల్ సైడర్ వినేగర్ వాడకం ఆశ్చర్యకర ఫలితాలనిస్తూ మీలోని అదనపు కొవ్వును కరిగించేస్తుంది. అయితే, యాపిల్ సైడర్ వినేగర్ అనేది ఒక యాసిడ్ అని అధికంగా వాడితే హాని కలిగిస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీనిని స్ప్రే బాటిల్ లో వేసుకుని రాసుకోవాలి. తర్వాత 30 నిముషాలకు వాష్ చేసుకోవాలి.

Subscribe to get more Posts :