Saturday, June 18, 2016

Natural Home Remedies For Hair Fall Control

వెంట్రుకలు రాలటం తగ్గాలంటే?


తల వెంట్రుకలు రాలతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారూ ఎంతో బధకు గురవ్తున్నరు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధరణం అయిపోయింది. ఈ సమస్య తో బాధపదేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టు పార్లర్ల చుట్టు తిరుగుతున్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అంతేకం. అయితే ఈ సమస్యకు వారి వంశపారంపర్యత కూడా కావచ్చు. అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్లో రక్తప్రసరణ జరగకపొవటం, పౌష్టికాహారలోపం, జన్యు పరమైన సమస్యలు కూడా కావచ్చు. ఈ సమస్య నుంచీ బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలు ఉన్నయి. అవేంటో చుద్దామా.

జుట్టు ఊడకుండా ఉండెందుకు గృహ చిట్కాలు (hair loss control tips in Telugu)

 

మెంతులు

మెంతులు ప్రతీ ఇంటిలో ఉండేవే. కానీ వీటి గొప్పదనం ఎంతో ఉంది. వీటిలో హార్మోన్ యాంటీయాసిడెంట్లు ఉండటమే కాక నికోటినిచ్ ఆసిడ్ ఉండటం వల్ల వెంట్రుకలు ఊడకుండా చేయటమే కాక కుదుళ్ళు గట్టిపడేలా చెసి వెంట్రుకలు రాలకుండా చేయటమేకాక మల్లి జుట్టు మొలిచేలా కూడా చేస్తుంది.
ఇప్పుడు ఇన్ని గుణాలు ఇందులో ఉన్నాయని తెలిసి మీలో దీనిని ఎలా ఉపయోగించాలా అన్న ఉత్సుకత పెరిగే ఉంటుంది. సరే ఇక మెంతుల్ని తీసుకుని వాటిని నీటిలో రాత్రి అంతా నానపెట్టాలి. పొద్దున్నే వాటిని గ్రిండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని స్కాల్ప్ కు కుడుళ్ళవరకూ పట్టించాలి. తరువాత 30 నిముషాలు ఉంచుకోవాలి. తర్వాత నీటితో కడుగుకోవాలి. దీనికి షాంపూ అవసరం లేదు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఆ ఫలితాలు మీరు చూడవచ్చు.

అలోవేర

అలోవెరా కూడా ప్రతి ఇంటిలో ఉండే మొక్కే. కానీ దీనిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది సర్వసాధారణమైన విషయమైపోయింది. ఎంచేతంటే కాలుష్యం వల్ల ఇలా జరుగుతోంది.అలోవేరా జుట్టు సమస్య నుంచీ కాపాడటమే కాక మల్లి జుట్టు పునరభివృధ్ధికి ఎంతో మంచిది. అలోవేరా వాడటం వల్ల ఊడటం తగ్గించటమే కాక దురద లంటి వాటినుంచీ బయటపడేస్తుంది. అంతేకాక పీహెచ్ హెచ్చుతగ్గుల్ని సరిచేస్తుంది. అంతేకాక చుండ్రు నుంచీ బయటపడేస్తుంది కూడా. అలొవేరా ఆకుల్ని తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తర్వాత ఆ పేస్ట్ ని జుట్టు కుద్దుళ్ళకు అలాగే స్కాల్ప్ కి పెడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే ఆ ఫలితాన్ని మీరే గుర్తించవచ్చు.

ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి సైతం చేయలేదు అన్న సామెత ముమ్మాటికీ నిజం. మనకు కిచెన్లోనే కాక ఎన్నో చోట్ల ఉపయోగపడుతుంది. అలాగే మీకు జుట్టు బాగా ఊడిపోతోందని బాధపడుతుంటే ఉల్లి ఆ సమస్యని పరిష్కరిస్తుంది. ఉల్లిపాయల్ని తీసుకుని గుజ్జుగా గ్రైండ్ చేసుకుని మీ స్చాల్ప్ కి కుదుళ్ళకి పెట్టుకుని కాసేపాగిన తర్వాత కడుగుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లి స్కాల్ప్లోని రక్తప్రసరనను సరి చేస్తుంది.

వేడినూనె మస్సాజ్

వేడినూనె తో తలకు మస్సాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. న్యూట్రీషన్ లోపం సమస్య వల్ల జుట్టు రాలుతుంది. మోస్తరు వేడి నూనే తీసుకుని కొన్ని నిముషాలు అలా మర్ధనా చేసుకుంటే రక్త ప్రసరణే కాదు, కురులు చాలా గట్టిపడతాయి. అంతేకాదు మీరు ఆయిల్ వాడటం వల్ల దానిలో ఉన్న విటమిన్-ఇ స్కాల్ప్ పై బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనె, ఆల్మండ్, మస్టర్డ్, జొజోబా లాంటి నూనెలు మంచి ఫలితాన్నిస్తాయి. అలాగే మీరు ఆయిల్స్ ని కలిపి మిశ్రమాన్ని పెట్టుకోవచ్చు. ఆయిల్ తీసుకుని దానిని ఇనుప లేదా స్టీల్ బౌల్ లో ఉంచి దానిని వేడి చేసి స్కాల్ప్ పై రాసుకుంటే ఎంతో మంచిది.అలా రాసిన తర్వాత కాసేపు మర్ధన చేసుకోవాలి. రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే తలస్నానం చేయాలి.

పెరుగు

పెరుగు కూడా జుట్టు రాలటం సమస్యను తగ్గిస్తుంది. తలపై పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా జీవంగా కనిపించేలా చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె మిశ్రమంగా చేసి స్కాల్ప్ కి పెట్ట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి.

గూస్బెర్రి ఆయిల్

భారత దేశంలో ఉన్నత జాతి ఆయిల్గా పేరొందిన గూస్బెర్రి ఆయిల్ ను వాడటం వల్ల స్కాల్ప్ కే కాదు జుట్టు కు కూడా బలం చేకూరుతుంది. జుట్టు రాలటానికి ఒక కారణం విటమిన్ -సి కూడా కారణం . ఈ ఆయిల్ లో అది పుష్కళంగా ఉంటుంది. కొన్ని గింజల్ని తీసుకుని వాటిని గ్రిండ్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి కొన్ని చుక్కలు నిమ్మ ను కలపాలి.లేదా కలపకుండా పెట్టుకోవచ్చు. ఒక గంట ఆగాకా కడుగుకోవాలి.

లికో రైస్ ఆయిల్

లికోరైస్ ఆయిల్ వెంట్రుకల్ని పటుత్వం గా ఉండేలా చేస్తాయి. ఇది స్కాల్ప్ పై వచ్చే పొడల్ని, దురదల్ని, ఇట్చింగ్ నీ తగ్గిచేతుంది. ఒక రాత్రి అంతా లికొరైస్ మూలాల్ని పాలల్లో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని దానిని తలకు పట్టించి రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే స్నానం చేసేయాలి.

Subscribe to get more Posts :