Friday, March 3, 2017

దంతాలకు బలాన్నిచే ఎండుద్రాక్ష తినండి కంటిని కాపాడుకోండి

ఎండుద్రాక్ష కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 15 ఎండు ద్రాక్షలను తినాలి. చర్మం ముడతలు పడడాన్ని ఎండుద్రాక్షలు అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. 

అలాగే నట్స్‌లో ఒకటైన జీడిపప్పులను రోజుకు నాలుగైదు తింటే బరువు తగ్గొచ్చు. అయితే మితంగా తీసుకోకపోతే కష్టమే. ఎండ ప్రభావంతో పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు ఆయిల్ సరిచేస్తుంది. కాలి పగుళ్లను కూడా తగ్గించగలదు. వీటిలో ఉండే విటమిన్ ఈ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఇక బాదం పప్పు ఫేస్ ఫ్యాక్‌కు బాగా పనికొస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, పీచు సమృద్ధిగా ఉంటాయి. మొటిమల నివారణకు ఉపయోగకారిగా ఉంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృతకణాలు తొలగిపోవడంతో.. ముఖానికి కాంతి చేకూరుతుంది.

Subscribe to get more Posts :