Friday, March 3, 2017

వెన్ను నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

1. మనం కూర్చొన్న కుర్చీ టైబుల్ బల్లకు వీలైనంత దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. చెక్క కూర్చీలో కూర్చుండి... హఠాత్తుగా పక్కకు తిరిగే ప్రయత్నం చేయరాదు. ఒకవేళ పక్కకు తిరగాల్సి వస్తే శరీరమంతా తిప్పి తిరాగలని సూచిస్తున్నారు. కుర్చీలో కూర్చొన్నపుడు రెండు పిరుదులు సమంగా కుర్చీకి అనుకునేలా ఉండాలంటున్నారు.

 
 2. ముఖ్యంగా ఒకే విధంగా గంటల కొద్ది కూర్చొని పని చేయరాదని సలహా ఇస్తున్నారు. అలాగే, పని చేసే సమయంలో మెడను పక్కకు వాల్చొద్దని, నేరుగా ఉంచి పని చేసినట్టయితే వెన్ను నొప్పి రాదంటున్నారు. 

 
 3. కుర్చీలో నుంచి టేబుల్‌పైకి వంగినట్టుగా కూర్చోరాదని, కాళ్లను కిందకు వేళ్లాడదీసి కూర్చోవద్దని సలహా ఇస్తన్నారు. కూర్చొన్నపుడు కాళ్లు కిందకు ఆనకుంటే పాదాల కింద ఏదైనా ఎత్తైన పీటను వేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Subscribe to get more Posts :